: చంద్రబాబుకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఖరారు...రేపు సాయంత్రం 5 గంటల తర్వాత భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపాయింట్ మెంట్ లభించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు రేపు చంద్రబాబు హైదరాబాదు రానున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎంఓ నుంచి తెలంగాణ సీఎంఓకు అపాయింట్ మెంట్ కోరుతూ ప్రతిపాదన అందింది. క్షణాల్లో స్పందించిన తెలంగాణ సీఎంఓ అధికారులు కేసీఆర్ తో భేటీకి చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత రావాలని ఏపీ సీఎంఓకు సమాచారం పంపారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల తర్వాత కేసీఆర్ ను చంద్రబాబు కలవనున్నారు. ఆ తర్వాత గానీ, అంతకుముందు గాని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు కూడా చంద్రబాబు ఆహ్వానం పలకనున్నారు.