: మీడియాపై పవన్ కల్యాణ్ బౌన్సర్ల దాడి... పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ వద్ద కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికను పవన్ కల్యాణ్ కు అందజేసేందుకు ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు కొద్దిసేపటి క్రితం అక్కడకు చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు కూడా అక్కడకు చేరుకున్నారు. పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రులు ఆహ్వాన పత్రికను అందించే దృశ్యాలను చిత్రీకరించేందుకు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన కెమెరామెన్లతో పాటు ప్రింట్ మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా స్టూడియో లోపలికి వెళ్లారు. అయితే వీరిని అడ్డుకున్న పవన్ కల్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది (బౌన్సర్లు) దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు కెమెరామెన్లతో పాటు ఫొటోగ్రాఫర్లకు కూడా గాయాలయ్యాయి. కెమెరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.

  • Loading...

More Telugu News