: ప్రముఖ న్యాయవాది సాల్వేకు మాఫియా డాన్ నుంచి బెదిరింపులు


జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వేకు మాఫియా డాన్ రవి పూజారి నుంచి బెదిరింపులు వచ్చాయి. 'నీ ఫోటోకు దండ వేసేస్తాం జాగ్రత్త' అంటూ పరోక్షంగా చంపేస్తామని బెదిరించినట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీలోని సాల్వే కార్యాలయానికి +61(ఆస్ట్రేలియా) అనే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిసింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని, వేరే దేశంలో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయంపై న్యాయవాది సాల్వే కార్యాలయ వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు. ఈ కాల్ ఆస్ట్రేలియాలోని న్యూకేజిల్ నుంచి రావడంతో, దాని ద్వారా పూజారి ఎక్కుడున్నాడో తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు సమాచారం అందించారు. చాలా ఏళ్ల నుంచి పూజారి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఎక్కువగా ఆయన కార్యకలాపాలు ముంబై కేంద్రంగా కొనసాగుతాయి.

  • Loading...

More Telugu News