: దసరా సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెంపు
దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెరిగింది. ప్రస్తుతం ఫ్లాట్ ఫాం టికెట్ ధర పది రూపాయలుగా ఉంది. ఇప్పుడది రూ.20కి పెంచారు. ఈ రోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఈ పెంపుదల అమల్లో ఉంటుంది. పండుగ సెలవుల సందర్భంగా రద్దీని నియంత్రించేందుకే టికెట్ ధర పెంచినట్టు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ నెల 21, 22 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.