: సారీ చెప్పిన బెల్లంపల్లి ఎమ్మెల్యే... హరీశ్ సమక్షంలో ఇంజినీర్ కు క్షమాపణ


బిల్లుల మంజూరులో జాప్యం చేశారంటూ ఇంజినీర్ గల్లా పట్టుకుని చెంపలు వాయించిన ఆదిలాబాదు జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. సాగు నీటి శాఖ ఏఈఈ దేవేందర్ ను తాను కొట్టలేదని, కేవలం దుర్భాషలాడానని ఎమ్మెల్యే ఇచ్చిన వివరణకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంతృప్తి చెందలేదు. దీంతో ఎమ్మెల్యే సారీ చెప్పక తప్పలేదు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత బంజారాహిల్స్ లోని మంత్రుల క్వార్టర్లలోని హరీశ్ నివాసంలో ఎమ్మెల్యే చిన్నయ్య ఇంజినీర్ దేవేందర్ కు క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే గారి ‘సారీ’ తంతును ఇంజినీర్ల జేఏసీ ప్రతినిధులు, బాధితుడు దేవేందర్ తండ్రి సమక్షంలో హరీశ్ రావు జరిపించారట.

  • Loading...

More Telugu News