: అమరావతి కాదిది... 'భ్రమ'రావతి: వైకాపా
అమరావతి నగర శంకుస్థాపనకు వెచ్చిస్తున్న మొత్తంపై తప్పుడు లెక్కలు చెబుతూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న చంద్రబాబు సర్కారు, వారి నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొనే దారిలేకనే వైకాపాపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. జగన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక, ఆయన్ను విమర్శించేందుకు ఏకంగా మంత్రుల బృందాన్నే ఏర్పాటు చేశారని వైకాపా నేత పార్థసారథి నిప్పులు చెరిగారు. తాము అమరావతి నగరానికి వ్యతిరేకం కాదని, దాన్ని చూపుతూ ప్రజలను 'భ్రమ'ల్లోకి గురిచేస్తున్నందునే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. రైతులకు అన్యాయం జరుగుతున్నందునే పోరాడుతున్నామని, నవ్యాంధ్ర రాజధాని 'భ్రమ'రావతిగా మారిపోయిందని విమర్శించారు.