: మాక్ బుక్ వెనక్కిచ్చేస్తే రూ. 19,500 ఇస్తామంటున్న మైక్రోసాఫ్ట్
గతంలో ఎవరైనా 'మాక్ బుక్'ను కొనుగోలుచేసి, ఇప్పుడు విండోస్ 10 మెషీన్ కు అప్ గ్రేడ్ కావాలనుకునే వారికి భారీ ఆఫర్ ను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 10 కావాలనుకునే వారు మాక్ బుక్ ను తిరిగి ఇచ్చేస్తే, 300 డాలర్లు (సుమారు రూ. 19,500-ఒక్కో డాలర్ రూ. 64.9697పై) వెనక్కిచ్చేస్తామని తెలిపింది. పాత ల్యాప్ టాప్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే 200 డాలర్లు (సుమారు రూ. 13 వేలు) తగ్గిస్తామని వెల్లడించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 20లోగా విండోస్ 10 ఆధారిత సిస్టమ్స్ కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. కాగా, ప్రస్తుతం విండోస్ 10 సిస్టమ్ ధర 599 డాలర్లుగా (సుమారు రూ. 38,910) ఉంది.