: సుప్రీం తీర్పును గౌరవిస్తాం... ‘జ్యుడీషియల్’ తీర్పుపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుపై నరేంద్ర మోదీ సర్కారు వేగంగా స్పందించింది. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. అయినా అప్పటిదాకా అమల్లో ఉన్న కొలీజయంను రద్దు చేస్తూ కొత్తగా ప్రతిపాదించిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ బిల్లును ఉభయ సభల్లో ఏర్పాటు చేసిన సభా సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏదేమైనా కమిషన్ రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టు చెప్పిన తీర్పును గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు కాపీ అందగానే దీనిపై మరింత లోతుగా దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.