: ఎల్లుండి నుంచి ‘అమరావతి’ రైతులకు చీర-ధోవతి పంపిణీ
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు సమయం సమీపిస్తోంది. శంకుస్థాపనకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 19 నాటికే ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇక రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను స్వచ్ఛందంగా అందజేసిన రైతులను శంకుస్థాపనకు ఆహ్వానించే కార్యక్రమం ఎల్లుండి(ఈ నెల 18) నుంచి ప్రారంభం కానుంది. భూములిచ్చిన రైతులకు చీర సారెతో స్వాగతం పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైతులకు ఎల్లుండి నుంచి చీర-ధోవతి పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు.