: తెలంగాణలో చైనా ప్రతినిధి బృందం... పెట్టుబడులపై నేడు కేసీఆర్ తో చర్చలు


కొత్త రాష్ట్రం తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టే నిమిత్తం ఇటీవల కేసీఆర్ భారీ ప్రతినిధి బృందంతో చైనాలో పది రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ యత్నాలు ఫలించి చైనా ప్రతినిధుల బృందం తెలంగాణకు వచ్చింది. నేడు సదరు ప్రతినిధులు సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి కేసీఆర్ తో వారు కీలక చర్చలు జరపనున్నారు. ఇక చైనా ప్రతినిధులకు తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించేందుకు పరిశ్రమల శాఖ అధికారులు ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News