: బాలికను అపహరించుకెళ్లిన దుండగులు


ఏడేళ్ల బాలికను దుండగులు అపహరించుకెళ్లిన సంఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగింది. బాలిక తమ ఇంటిముందు ఆడుకుంటోంది. అదే సమయంలో బైక్ పై వచ్చిన దుండగులు బాలికను అపహరించుకుపోయారు. బాలిక తల్లిదండ్రులు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను పట్టుకుంటామని, అవసరమైన సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News