: భవిష్యత్తులో మీరు కీలక రాజకీయ నేతగా ఎదుగుతారు!: కేటీఆర్ కు ములాయం ప్రశంస
‘తెలంగాణ ప్రజల కోసం మీరు పడుతున్న తపన అభినందనీయం. భవిష్యత్ లో కీలక రాజకీయ నేతగా ఎదుగుతారు’ అంటూ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ, ఐటీ మంత్రి కేటీఆర్ పై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈరోజు వారిద్దరూ లక్నోలో సమావేశమయ్యారు. బీహార్ ఎన్నికలు, దేశ రాజకీయాలు మొదలైన అంశాలపై వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆహ్వానం మేరకు కేటీఆర్ గురువారం లక్నో వెళ్లారు. ఇప్పటికే అఖిలేష్ తో ఆయన భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణాలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ పథకంపై అఖిలేష్ ఆసక్తి కనబర్చారు.ఈ నేపథ్యంలో కేటీఆర్ ను అఖిలేష్ ఆహ్వానించారు.