: అమరావతి శంకుస్థాపనకు రూ. వందల కోట్లు అవాస్తవం... రూ. 9 కోట్లు మాత్రమే: మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ
ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామనడం పూర్తిగా అవాస్తవమని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పని గట్టుకొని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వారు విమర్శించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన వారు, ఇప్పటివరకూ కేవలం రూ. 9 కోట్లను మాత్రమే విడుదల చేశామని తెలిపారు. ఆ నిధులే ఇంకా పూర్తిగా ఖర్చు కాలేదని, నిధుల ఖర్చు విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని వెల్లడించారు.