: 'మై బ్రిక్ - మై అమరావతి' ట్యాగ్ లైన్ తో వెబ్ సైట్ ప్రారంభం
‘మై బ్రిక్- మై అమరావతి (నా ఇటుక - నా అమరావతి)’ ట్యాగ్ లైన్ తో వెబ్ సైట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాజధాని అమరావతికి విరాళాలు ఇచ్చే వారి కోసం ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. అయితే, వెబ్ సైట్ ప్రారంభించిన సెకన్ల వ్యవధిలోనే సింగపూర్ నుంచి 108 ఇటుకలను ఒక ప్రవాసాంధ్రుడు కొనుగోలు చేశాడు. నా ఇటుక- నా అమరావతి వెబ్ సైట్ లో ఒక్కొక్క ఇటుక ఖరీదు రూ.10 అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 22వ తేదీన నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. Please visit the following website to make donations http://amaravati.gov.in/