: వారంలో ఒక రోజు మోతబరువు తప్పించిన మహారాష్ట్ర
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జన్మదిన వేడుకల నాడు మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినీ, విద్యార్థులకు అద్భుత కానుకను అందించింది. ఇకపై విద్యార్థులెవరూ గురువారం నాడు ఇళ్ల నుంచి స్కూలు పుస్తకాలు వీపులపై మోసుకుంటూ రానక్కర్లేదని ఆ రాష్ట్ర విద్యా మంత్రి వినోద్ తావ్ డే ఆదేశాలు జారీ చేశారు. ఆనాడు స్కూళ్లలో తమ తమ క్లాసులకు సంబంధంలేని పుస్తకాలు చదవాలని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో 'గిఫ్ట్ ఏ బుక్' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనుందని, పలు చోట్ల పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. ఓ జడ్పీ హైస్కూలులో కలాం రీడింగ్ హబ్ ను ప్రారంభించిన ఆయన విద్యార్థులకు పుస్తకాలను బహూకరించారు.