: మూడు నెలల్లో దేశవ్యాప్తంగా బీఫ్ నిషేధం: కేంద్రానికి సూచించిన హైకోర్టు


ఇండియాలో ఆవు మాంసాన్ని నిషేధించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, పశుమాంసం ఎగుమతి, దిగుమతులను సైతం నిలిపివేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ విషయంలో మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆపై గోవులను కాపాడేందుకు, వాటి పోషణ, భద్రత నిమిత్తం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను అందించాలని జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్ లతో కూడిన డివిజన్ బెంచ్ మోదీ ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయమై జనవరి 6న తిరిగి విచారణ చేపడతామని, ఆలోగా గో సంరక్షణ దిశగా, కేంద్రం చేపట్టాలని భావిస్తున్న ఆలోచనల పూర్తి వివరాలను అందించాలని కేంద్ర కార్యదర్శిని ఆదేశించింది. ప్రతి గ్రామంలో 'గోసదన్'లు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని అన్ని పంచాయతీలనూ కోరింది.

  • Loading...

More Telugu News