: ముస్లింను అయినందుకు కక్ష కట్టారు: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా


ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, ఇటీవల తనకు ఎదురైన అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయుడినే అయినప్పటికీ, ముస్లింను అయినందువల్ల తనపై కక్ష కట్టారని ఆరోపించారు. "నా పేరు నసీరుద్దీన్ షా. అందువల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నాను. ఇది చాలా బాధాకరం. నాకు ఈ రకమైన గుర్తింపు కూడా ఉన్నదని ఇంతవరకూ తెలియదు" అని ఆయన అన్నారు. భారతదేశంలో వాక్ స్వాతంత్రపు హక్కు ప్రజల నుంచి దూరమవుతున్నట్టు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ పాక్ కళాకారుడిని పొగిడితే, దాన్ని భారత వ్యతిరేకతని ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్ గొప్ప క్రికెటర్ అని తానంటే, సునీల్ గవాస్కర్ ను తక్కువ చేసినట్టు కాదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News