: అత్యంత శక్తిమంతమైన మహిళలు ఇస్తున్న అమూల్యమైన సలహాలు!


ఫార్చ్యూన్ ప్రకటించిన ప్రపంచంలోని మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ సమ్మిట్ వాషింగ్టన్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జనరల్ మోటార్స్ చీఫ్ మేరీ బర్రా నుంచి గేట్స్ ఫౌండేషన్ సీఈఓ సుసాన్ దేశ్ మాండ్ వరకూ ఎందరో మహిళలు తమ అనుభవాలు పంచుకున్నారు. ఏదైనా సలహా చెప్పమని వారిని అడిగితే తమ అనుభవాలను గుర్తు తెచ్చుకుని మరీ కొన్ని అమూల్యమైన సలహాలు వారిచ్చారు. టాప్-5 సలహాలివి... కళ్లు మూసుకుని మరోసారి లభించిన అవకాశం గురించి ఆలోచించాలి... ఏదైనా ఒక పనిని చేస్తారా? అని మహిళలను ప్రశ్నిస్తే, "ఇదే సరైన సమయమని నేను చెప్పలేను", "నేను సిద్ధంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను" అన్న సమాధానాలు వస్తాయి. అదే పురుషులను అడిగితే, "యస్... నేను చేస్తాను" అని వినిపిస్తుంది. మహిళలు ఎదగడానికి వారి మరోసారి ఆలోచించే గుణమే సహకరిస్తోంది. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మరో నిమిషం ఆలోచించే సమయం తీసుకుంటే మంచిది. - కారోలిన్ టాస్టాడ్, ప్రోక్టర్ అండ్ గాంబుల్ నార్త్ అమెరికా ప్రెసిడెంట్. ఉద్యోగులను ఎక్కువ సమయం పనిచేయించేటప్పుడు వారి భాగస్వామిని గుర్తించాలి... ఈ ఆలోచన నాది కాదు. మీ కింద పనిచేస్తున్న ఉద్యోగులతో అధికంగా పనిచేయించాల్సి వస్తే వారి జీవిత భాగస్వామిని గుర్తించాలి. నేను ఆపని చేసి విజయవంతమైయ్యా. అధిక గంటలు పనిలో నిమగ్నమైన వేళ, ఉద్యోగుల భార్యలకు స్వయంగా ఫోన్లు చేసి వారందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపాను. వారికి బహుమతులు పంపించాను. దీంతో పాటు ఓ లీడర్ గా కిందివారిలో లక్ష్యం పట్ల మరింత పట్టుదలను కలిగించాలి. - ఎవర్సన్, ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్. అసౌకర్యాన్ని సౌకర్యంగా చేసుకుంటే ఎదుగుతారు... కెరీర్ గ్రోత్ అంత సులభమేమీ కాదు. సౌకర్యంగానూ ఉండదు. జీవితం నుంచి ఏ క్షణాన అధికంగా నేర్చుకుంటామో తెలుసా? అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురైన వేళ. ఆ క్షణాలు ఎంతో అనుభవాన్ని అందిస్తాయి. ఆ అనుభవం నేర్పే పాఠాలు మరింత ఎత్తునకు దూసుకెళ్లేందుకు సహకరిస్తాయి. అసౌకర్యం కలిగిన వేళ, దాన్నే సౌకర్యంగా భావిస్తే తిరుగుండదు. - జిన్నీ రోమెట్టీ, ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్. మీ వ్యక్తిగత బలహీనతలను టీంకు చెప్పాలన్న బలహీనత దాచుకోవాలి... ఈ విషయంలో పురుషుల కంటే మహిళలు తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బలహీనతల గురించి తెలియకుండానే మాట్లాడేస్తారు. బలహీనతలను టీంకు చెప్పే బలహీనత వదులుకోవాలి. నేను నా ఆరేళ్ల కొడుకుకు ఏదైనా చెప్పాలంటే భయపడతాను. అదే ఐరాసలో మాట్లాడమంటే... అది నాకున్న బలహీనత. దీన్ని దూరం చేసుకోవాలి. - సమంతా పోవర్, ఐరాసలో అమెరికా శాశ్వత ప్రతినిధి.

  • Loading...

More Telugu News