: సినిమా బాగుంటే థియేటర్లకు కొరతేంటి?: దగ్గుబాటి సురేష్ బాబు


ఓ సినిమా బాగుంటే, థియేటర్ల కొరత ఎన్నడూ రాదని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వ్యాఖ్యానించారు. రామచంద్రాపురంలో 'సూర్య సినిమాస్' జంట థియేటర్ల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల 'భలే భలే మగాడివోయ్', 'సినిమా చూపిస్త మావ', అంతకుముందు 'ఉయ్యాల జంపాల' వంటి మంచి చిన్న చిత్రాలకు సినిమా హాళ్ల కొరత రాలేదని గుర్తు చేశారు. పెద్ద చిత్రాల విడుదలకు మధ్య మరింత సమయం (గ్యాప్) ఉంటే మంచిదని, సమస్య పరిష్కారం కోసం థియేటర్ల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి సినిమా అయినా, ప్రజలకు నచ్చేలా ఉండి వారిని థియేటర్లకు రప్పించగలిగితే సమస్యే ఉండదని అన్నారు.

  • Loading...

More Telugu News