: చలి పులి... విశాఖ మన్యంలో వణికిపోతున్న జనం
అక్టోబర్ మాసం ముగియనేలేదు. అప్పుడే చలి పులి జడలు విప్పింది. గడచిన రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఏపీలోని విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. నిన్న రాత్రి విశాఖ ఏజెన్సీలోని మినుములూరులో 12, పాడేరులో 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఉదయం 10 గంటల దాకా మంచు దుప్పటి వీడటం లేదు. ఫలితంగా అక్కడి ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికాలం ప్రారంభం కాకముందే ఈ తరహాలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మున్ముందు మరింత విషమ పరిస్థితులు ఎదురుకాక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.