: కర్నూల్ జిల్లా ఫ్యాక్షనిస్టుపై హత్యాయత్నం
కర్నూల్ జిల్లాకు చెందిన ఫ్యాక్షనిస్టు రాఘవరెడ్డిపై ఈరోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆళ్ళగడ్డ మండలం చింతకుంటలో ఫ్యాక్షనిస్టు అయిన రాఘవరెడ్డి వాహనంలో వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన వెళుతున్న వాహనాన్ని టిప్పర్ తో ఢీకొట్టారు. కళ్లలో కారంపొడి చల్లి వేటకొడవలితో ఆయనపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రాఘవరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పాతకక్షల నేపథ్యంలోనే రాఘవరెడ్డిపై హత్యాయత్నం జరిగి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.