: డికాక్ క్యాచ్ అవుట్... దక్షిణాఫ్రికా స్కోర్ 52


రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 52 పరుగుల వద్ద తన రెండో వికెట్ కోల్పోయింది. హర్భజన్ సింగ్ బౌలింగ్ లో క్రీజు బయటకు వచ్చి షాట్ కొట్టిన డికాక్ మోహిత్ శర్మకి క్యాచ్ యిచ్చి అవుటయ్యాడు. 10వ ఓవర్ లో మొదటి బాల్ కే ఫోర్ కొట్టాడు. అయితే, ఆ తర్వాతి బంతిని షాట్ కొట్టేందుకు ప్రయత్నించి శర్మ చేతికి క్యాచ్ ఇచ్చాడు. కాగా, ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో బంతిని షార్ట్ మిడ్ వికెట్ దిశగా మళ్లించేందుకు డికాక్ యత్నించాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ క్యాచ్ పడుతుండగా బంతి పట్టుజారిపోవడం తెలిసిందే.

  • Loading...

More Telugu News