: ఇన్ఫోసిస్ లో 2 వేల మందికి పైగా ప్రమోషన్లు... 100 శాతం పెరిగిన జీతం!


ఇన్ఫోసిస్ లో ప్రమోషన్ల కాలం. దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల ఎగుమతి సంస్థగా ఉన్న సంస్థలో 2 వేల మందికి పైగా ప్రమోషన్లు లభించాయి. ఉద్యోగంలో మంచి పనితీరు కనబరిచిన వారందరికీ ప్రమోషన్లు ఇచ్చామని, మొత్తం 2,067 మందికి ఉన్నత స్థానాలు ఇచ్చామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీరందరి వేతనాలు 80 నుంచి 100 శాతం వరకూ పెరిగాయని పేర్కొంది. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,711 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్టు తెలిపింది. కాగా, సంస్థలో పెరుగుతున్న అట్రిషన్ రేటును అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే ప్రమోషన్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇన్ఫోసిస్ నుంచి 14.1 శాతం మంది రాజీనామాలు చేసి పోవడంతో, అనుభవజ్ఞులను వదులుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News