: టీమిండియా టాస్ గెలిచింది... మరి ఫలితం కూడా మారినట్టేనా?
ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఇప్పటిదాకా మూడు మ్యాచ్ (రెండు టీ20లు, ఓ వన్డే)లు జరిగితే, మూడింటిలోనూ టాస్ సఫారీల వైపే మొగ్గింది. అంతేకాదు, ఆ మూడు మ్యాచ్ లలోనూ టీమిండియాకు పరాజయం ఎదురు కాగా, టీ20 సిరీస్ ను పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా ఎగరేసుకుపోయింది. వన్డే సిరీస్ లో భాగంగా మొన్న కటక్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డివిలియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని సత్తా చాటాడు. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి ఆతిథ్య జట్టును బోల్తా కొట్టించాడు. మరికాసేపట్లో, ఇండోర్ లో ఈ సిరీస్ లో భాగంగా రెండో వన్డే మొదలుకానుంది. కొద్దిసేపటి క్రితం జరిగిన టాస్ లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ విజయం సాధించాడు. టాస్ నెగ్గిన ధోనీ ఫస్ట్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. మరి టాస్ గెలిచిన టీమిండియా మ్యాచ్ ను కూడా గెలుస్తుందనే ధీమాతో క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.