: శంకుస్థాపన నేపథ్యంలో స్పైస్ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది. ఈ నెల 21, 22 తేదీల్లో విమాన సర్వీసులు నడపనున్నామని వెల్లడించింది. ఢిల్లీ-విశాఖ, విశాఖ-హైదరాబాద్, ఢిల్లీ-హైదరాబాద్, హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-ఢిల్లీ రూట్లలో ప్రత్యేక విమాన సర్వీసులు నడపుతామని వివరించింది. శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుండటం, దేశ, విదేశాల నుంచి ప్రముఖులు రాబోతున్న నేపథ్యంలోనే ప్రత్యేక విమాన సర్వీసులు నడపాలని స్పైస్ జెట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News