: ఎస్పీజీ భద్రతలోకి ఉద్దండరాయునిపాలెం... రేపే ఎంట్రీ ఇవ్వనున్న ప్రధాని రక్షక దళం
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నెల 22న విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అమరావతిలో మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. దీంతో ఇక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) రంగంలోకి దిగబోతోంది. అమరావతి శంకుస్థాపన కేంద్రం ఉద్దండరాయునిపాలెం పరిసరాలను ఎస్పీజీ బృందం తన అధీనంలోకి తీసుకోనుంది. రేపు ఉద్దండరాయునిపాలెం వస్తున్న ఎస్పీజీ సిబ్బంది, ప్రధాని పర్యటన ముగిసేదాకా అక్కడి భద్రతపై నిత్యం నిఘా కన్ను వేసి ఉంచనుంది.