: విపక్షాలు మమ్మల్ని శంకించాల్సిన అవసరంలేదు: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో విపక్షాలు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 35 ఏళ్ల నుంచి పనులు చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నామని, రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారని ఢిల్లీలో అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాజధాని ప్రణాళిక సిద్ధం కాక ముందే రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులిచ్చామని, రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని వెంకయ్య స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News