: అమరావతికి చంద్రబాబు నియోజకవర్గ టీడీపీ నేతల విరాళం రూ.5.05 లక్షలు
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇక విరాళాలు పోటెత్తనున్నాయి. రాజధాని నిర్మాణంలో ఏపీలోని 5 కోట్ల మందిని భాగస్వాములను చేయనున్నట్లు నిన్న సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం విరాళాల సేకరణకు ప్రభుత్వం ‘‘ప్రతి ఒక్కరు... ఓ ఇటుక’ పేరిట ఏపీ సర్కారు ప్రత్యేకంగా ఓ వెబ్ సైటును ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి కూడా ఇప్పటికే విరాళాలు ప్రారంభమయ్యాయి. తాజాగా నిన్న తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడి టీడీపీ నేతలు తమవంతుగా రూ.5.05 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో విరాళాల జోరు మరింత పెరగనుంది.