: రణసింగి కొండల్లో రణరంగం: పోలీసులకు, మావోలకు ఎదురుకాల్పులు
రణసింగి కొండల్లో రణరంగ వాతావరణం నెలకొంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో ఆప్రాంతం దద్దరిల్లుతోంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం రణసింగి కొండల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఏడుగురు మావోయిస్టులు ఉన్నారని భావించి కూంబింగ్ నిర్వహించినట్లు సమాచారం. పోలీసులు రావడాన్ని పసిగట్టిన మావోలు ఎదురు కాల్పులు జరిపి, అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు చెబుతున్నారు. మావోయిస్టులు పారిపోయిన ప్రాంతంలో ఉన్న గ్రెనేడ్లు, కిట్ బ్యాగ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.