: ఆ సీఐను వదలిపెట్టే ప్రసక్తే లేదు: టీడీపీ నేత ఎర్రబెల్లి
విచక్షణారహితంగా టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసిన సీఐ తిరుపతిని వదలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గత నెల 27న పాలకుర్తిలోని టీడీపీ కార్యాలయంపై దాడి సంఘటనను ఆయన గుర్తుచేశారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. సీఐ తిరుపతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని,ఆయనపై చర్యలు తీసుకునే వరకు చట్టపరంగా పోరాడతామని ఆయన అన్నారు. సీఐ తిరుపతిపై హైకోర్టులో కేసు వేయడంతో పాటు, మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు.