: ప్రతిపక్ష నేతకు ఉండాల్సిన లక్షణాలు జగన్ కు లేవు: కళా వెంకట్రావ్
వైకాపా అధినేత జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. ఒక ప్రతిపక్ష నేతకు ఉండాల్సిన లక్షణాలేవీ జగన్ కు లేవని విమర్శించారు. కేవలం తన పబ్బం గడుపుకోవడానికే జగన్ దీక్ష చేపట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కలిగించేందుకు వైకాపా యత్నిస్తోందని అన్నారు.