: నేను తుపాకీతో బెదిరించలేదు: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డి
టీడీపీ అర్బన్ అధ్యక్షుడు మురళిని తాను తుపాకీతో బెదిరించానంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్ నేత, డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమన్నారు. తుపాకీ కింద పడుతుంటే పట్టుకున్నానని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేశారని ఆరోపించారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లినట్టు చెప్పారు. తనను తుపాకీతో బెదిరించిన రాజేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి, లైసెన్సును రద్దు చేయాలని టీడీపీ నేత మురళి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో భూవివాదం నేపథ్యంలో ఇవాళ టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలోనే రాజేందర్ తుపాకీతో బెదిరించాడని వార్తలు వచ్చాయి.