: అమెరికన్ స్టార్ స్ర్కిలెక్స్ లో డ్యాన్స్ చేస్తూ మరణించిన ఢిల్లీ టెక్కీ అంచల్ అరోరా
కేవలం 8 వేల మంది ప్రజలు పట్టేందుకు వీలున్న గ్రౌండ్ లోకి 10 వేల మందికి పైగా అనుమతించడం ఓ మహిళా టెక్కీ ప్రాణాలను బలిగొంది. ఇటీవలి కాలంలో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమెరికన్ స్టార్ స్ర్కిలెక్స్ కార్యక్రమంలో నృత్యం చేసేందుకు తన స్నేహితులతో కలసి వచ్చిన అంచల్ అరోరా ఊపిరాడక, గుండెనొప్పితో మరణించింది. ఈ ఘటన గుర్గావ్ లో జరిగింది. 23 ఏళ్ల అంచల్ స్టార్ స్ర్కిలెక్స్ లో డ్యాన్స్ చేస్తూ, ఒక్కసారిగా కిందపడిపోగా, స్నేహితులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమం ఇటీవలి కాలంలో పాప్యులర్ అయిందని, అధిక సంఖ్యలో యువతీ యువకులు రావడం, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలం కావడం అంచల్ మరణానికి కారణమని పోలీసులు వెల్లడించారు.