: తెలంగాణ యువత ఆశలను ప్రభుత్వం వమ్ము చేస్తోంది: రేవంత్ రెడ్డి


టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ కరీంనగర్ లో పర్యటించారు. అక్కడి వారితో మాట్లాడి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించుకుంటే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెట్టుకుందని, కానీ ఆశలన్నింటినీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అస్తవ్యస్థ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని విలేకరులో సమావేశంలో చెప్పారు. అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు.

  • Loading...

More Telugu News