: ప్రధానమంత్రికి రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు సభలో అవకాశం ఇవ్వాలని కోరారు. మోదీ రాజధాని శంకుస్థాపనకు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని పర్యటనలో ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవాలని విన్నవించారు. ఏపీ అభివృద్ధికి పార్టీలన్నీ కలసిరావాలని లేఖలో పిలుపునిచ్చారు.