: మహారాష్ట్ర కార్పోరేషన్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన శివసేన!
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తలెత్తాయి. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్ కసూరీ పుస్తకావిష్కరణ నేపథ్యంలో సుధీంద్ర కులకర్ణికి శివసేన కార్యకర్తలు ఇంకు పూయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఘటనను 'మహా' సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. దాంతో బీజేపీతో విభేదిస్తున్న సేన త్వరలో జరగబోయే కల్యాణ్-డోంబివాలి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఈ కార్పొరేషన్ లో ఉన్న 122 సీట్లలోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. దానిపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రావ్ సాహెబ్ దాన్వే మాట్లాడుతూ, సేనతో పొత్తు విషయంలో తలదూర్చబోమన్నారు. నిర్ణయాన్ని కల్యాణ్ ప్రాంతీయ బీజేపీకే వదిలేస్తున్నట్టు తెలిపారు.