: తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు చాటి చెప్పేలా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా 16వేల గ్రామాల్లో 'మన నీరు-మన మట్టి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. ఇంద్రుడి రాజధాని అమరావతి అని, తెలుగువారి కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పేలా నిర్మాణం జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. అందరి సంకల్పంతో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని కోరారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో రాజధాని శంకుస్థాపనకు చంద్రబాబు పుట్టమట్టి సేకరించారు. ముందుగా పుట్టకు పూజలు చేసి ఆ తరువాత మట్టి సేకరించారు. అమరావతి శంకుస్థాపన విజయవంతం కావాలని ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. తరువాత సర్వమత ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు.