: నోబెల్ గ్రహీత... వైద్యానికి డబ్బుల్లేని దుస్థితిలో మరణం


రసాయన శాస్త్రంలో ఆయన పరిశోధనలకు నోబెల్ పురస్కారం వరించింది. అలాంటి వ్యక్తి వైద్యానికి డబ్బుల్లేని దీనాతిదీనావస్థలో మృతిచెందారు. 2010లో రసాయన శాస్త్రంలో చేసిన పరిశోధనలకు ప్రముఖ శాస్త్రవేత్త రిచర్డ్ హెక్ (84)ను నోబెల్ పురస్కారం వరించింది. కాగా, ఆయన 2006లోనే రిటైర్ అయ్యారు. నోబెల్ వచ్చిన రెండేళ్లకే ఆయన భార్య సొకారో నార్డో హెక్ మృత్యువాతపడ్డారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి మేనల్లుడే వారి బాగోగులు చూసుకునేవాడు. రిటైర్మెంట్ అనంతరం అందుతున్న పెన్షన్ తోనే ఆయన జీవనం గడిచేది. ఆయన పలురకాల వ్యాధులతో బాధపడేవారు. పెన్షన్ వైద్యం చేయించుకునేందుకే సరిపోయేది కాదు. అలాంటి పరిస్థితిలో అకస్మాత్తుగా వాంతులు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే బిల్లులు చెల్లించలేరని ఆయనను ఆసుపత్రిలో చేర్చుకోలేదు. వెంటనే మనీలాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీసుకెళ్లిన కొద్ది గంటల్లోనే ఆయన శరీర అవయవాలన్నీ పని చేయడం మానేశాయని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News