: అలారం మోగింది... విమానం దిగి ప్రయాణికులు పరుగో పరుగు


విమానంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు అలారం మోగింది. అంతే విమానంలో ఉన్న 160 మంది ప్రయాణికులు ఆదరాబాదరాగా దిగి పరుగులంకించుకున్న ఘటన జమైకాలో చోటుచేసుకుంది. మాంటెగో బేలోని విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్-737 విమానం 160 మంది ప్రయాణికులతో అట్లాంటా బయల్దేరేందుకు రన్ వేపైకి వచ్చి టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంతలో విమానం కార్గో డెక్ నుంచి మంటలు చెలరేగినట్టు సైరన్ మోగింది. రన్ వే పై విమానాన్ని నిలిపేసి, క్షణాల్లో అప్రమత్తమైన ఆరుగురు విమాన సిబ్బంది, 160 మంది ప్రయాణికులను అత్యవసర ద్వారాల ద్వారా కిందికి దించేశారు. రన్ వేపై నుంచి ప్రయాణికులు విమానాశ్రయంలోకి పరుగులు పెట్టారు. విమానాశ్రయం మూసేశారు. ఇతర విమానాలను కింగ్ స్టన్ విమానాశ్రయానికి తరలించారు. మంటలార్పేందుకు, పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు నిపుణులు, సైనికులు రంగంలోకి దిగారు. అయితే రన్ వే పై నిలిచిన విమానం నుంచి ఎలాంటి మంటలు రాలేదు. విమానంలోకి వెళ్లి చూడగా, పొరపాటున అలారం మోగిందని గుర్తించి హాయిగా నిట్టూర్చారు. అనంతరం పరిస్థితి అదుపులో ఉందని, విమానంలో ఈ పొరపాటు ఎందుకు జరిగిందో పరిశీలిస్తున్నామని విమానాశ్రయాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News