: కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఆటోడ్రైవర్లు
కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ, రాజీవ్ గృహకల్ప లబ్ధిదారుల రుణాలను మాఫీ చేయడానికి కేసీఆర్ హామీ ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. గతంలో తాము చేసిన విజ్ఞప్తిని ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. తమకు సహకరించిన మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే కమలాకర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.