: పీలేను నల్లముత్యమని పిలవడం నాకు గుర్తుంది: గంగూలి


‘1977లో మోహన్ బగాన్ తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆడేందుకు తొలిసారి కోల్ కతాకు పీలే వచ్చారు. అప్పుడు నా వయస్సు ఐదు సంవత్సరాలు. పీలేను నల్లముత్యంగా అభిమానులు పిలుచుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలి అన్నారు. కోల్ కతా కు వచ్చిన ఫుట్ బాల్ దిగ్గజం పీలేను గంగూలి కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను యుక్తవయస్సులో ఉన్నప్పుడు పీలే మ్యాచ్ లను చూసేవాడినన్నారు. పీలే ఆటతీరు అద్భుతంగా ఉంటుందని కొనియాడారు.

  • Loading...

More Telugu News