: కరీంనగర్ లో ముగ్గురు గొలుసు దొంగల అరెస్టు


తెలంగాణలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కరీంగనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లికి చెందిన నగునూరి శ్రావణ్ కుమార్, బండారి రాము, బొంకూరి సునిల్ రాజు అనే యువకులు ఒక బృందంగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు పలు జిల్లాల్లో దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలపై పోలీసులు నిఘా వేయడంతో ఈ ముగ్గురు దొంగలు దొరికిపోయారు. నిందితుల నుంచి 50 తులాల బంగారం, 11 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు.

  • Loading...

More Telugu News