: పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి: కంభంపాటి


ఢిల్లీలో ఏపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు జపాన్ పర్యటన ముగించుకుని నేడు దేశ రాజధానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. జపాన్ పర్యటన విజయవంతమైందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ లోని పలు కంపెనీలు ఆసక్తి చూపాయని తెలిపారు. డిసెంబర్ లో జపాన్ ప్రధాని భారత పర్యటనకు రానున్నారని, ఈ సమయంలో కొన్ని కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంటామన్నారని చెప్పారు. వ్యవసాయరంగంలో నూతన పద్ధతుల అమలుపై ఆ దేశ సాయం కోరామని కంభంపాటి వివరించారు. కాగా, పర్యావరణ అనుమతులు వచ్చాక రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య దూరం పెరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News