: మంత్రులు కామినేని, ప్రత్తిపాటి దిష్టిబొమ్మల దగ్ధం


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై మంత్రులు కామినేని, ప్రత్తిపాటి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి, రాయదుర్గంలో వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాగా, జగన్ దీక్షకు మద్దతుగా తాడిపత్రిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 30 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, పోలీస్ స్టేషన్ లోనే తమ దీక్షలు కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ నేత రమేశ్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News