: మరో 200 గ్రాముల బరువు తగ్గిన జగన్... ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలు


ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా అధినేత జగన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు మరోసారి పరీక్షించారు. జగన్ షుగర్ లెవెల్స్, పల్స్ రేటు మరింత పడిపోయాయని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. బీపీ 130/90, పల్స్ రేటు 80కి పడిపోయాయని చెప్పారు. ఈ ఉదయం నుంచి జగన్ 200 గ్రాముల బరువు తగ్గారు. ఈ క్రమంలో, జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైకాపా శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు, నిరాహార దీక్షను విరమించాలని జగన్ కు కొందరు వైకాపా నేతలు సూచిస్తున్నారు. మరో రూపంలో పోరాటం చేద్దామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News