: డిగ్గీ రాజా తెలంగాణ పర్యటన ఖరారు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు దిగ్విజయ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు ఆయన తెలంగాణలో పర్యటిస్తారు. కాగా, దిగ్విజయ్ పర్యటన వ్యూహాత్మకంగా సాగనున్నట్టు సమాచారం. వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు తగిన సలహాలు ఇచ్చే దిశగా ఆయన పర్యటన సాగనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ పర్యటన సందర్భంగా పార్టీకి చెందిన పలువురు నేతలతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై నేతలకు సూచనలు చేయనున్నారని, ఆ దిశగానే పర్యటన సాగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.