: రాజమహేంద్రవరంలో రియల్టర్ దారుణహత్య


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో రియల్టర్ శేషు (53) దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక నాగదేవి థియేటర్ సమీపంలో ఈ దారుణం జరిగింది. దుర్మరణం పాలైన శేషును కోర్లంపేటకాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. వ్యాపార లావాదేవీల్లో గొడవల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News