: ఆదినారాయణరెడ్డి వల్లే టీడీపీ అన్ని విధాలా నష్టపోయింది: టీడీపీ నేత రామసుబ్బారెడ్డి
వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశంలోకి ఆయన రాకను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని, పార్టీలోకి తీసుకోవద్దని వివరించానని తెలిపారు. హత్యా రాజకీయాలు చేసే వారిని తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. అధికారంలో ఉన్న పార్టీవైపు వెళ్లడం ఆదినారాయణకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అసలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన వల్లే టీడీపీ అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు జగన్ ను కాదని మాజీ సీఎం కిరణ్ వెంట తిరిగి మళ్లీ వైైసీపీలోకి వచ్చారని సుబ్బారెడ్డి విమర్శించారు.