: 'రుద్రమదేవి' పైరసీకి పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ లో 'రుద్రమదేవి' చిత్రం పైరసీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్ టాప్, సీడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు.