: 40 లక్షల మందిని ఆకట్టుకుంటున్న చిన్నారి


ఏ దేశంలోనైనా సైనిక ప్రోటోకాల్ కఠినంగా ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ను ఉల్లంఘించడమంటే కఠినశిక్షకు సిద్ధం కావడమే. అలాంటి ప్రోటోకాల్ కు అంతరాయం కలిగించిన ఓ చిన్నారి ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే...విధులు నిర్వర్తించేందుకు 9 నెలల క్రితం అమెరికా సైనికుడు లెఫ్టినెంట్ డానియెల్ ఓజెల్ బీ మధ్యప్రాచ్యానికి వెళ్లాడు. అమెరికా సైనిక ప్రోటోకాల్ ప్రకారం విదేశాల్లో విధులు నిర్వర్తించి వచ్చిన సైనికులకు కమాండర్ అధికారిక స్వాగతం పలకాలి. ఇందులో భాగంగా కొలరాడోలో డానియెల్ బృందానికి సైనిక లాంఛనాలతో స్వాగత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతలో నెలల తరబడి తండ్రికి దూరంగా గడిపిన డానియెల్ ఓజెల్ బీ కుమార్తె కేరిస్ తన తండ్రిని చూసింది. ఎగిరిగంతేసింది. ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వెళ్లి, తండ్రిని హత్తుకుంది. అంతే, కూతురు ఆనందాన్ని చూసిన తండ్రి కూడా ప్రోటోకాల్ ను పక్కనపెట్టి కుమార్తె ప్రేమకు తలవంచాడు. కిందకు వంగి కుమార్తెను హత్తుకున్నాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుమారు 40 లక్షల మంది దీనిని వీక్షించారు.

  • Loading...

More Telugu News